Header Banner

ఆ జిల్లాలో డ్రోన్ల కలకలం.. మోదీ ప్రసంగించిన కొద్ది నిమిషాలకే.!

  Mon May 12, 2025 22:39        Politics

జమ్ముకశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి డ్రోన్ల కదలికలు మరోసారి కలకలం రేపాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించిన కొద్ది నిమిషాల వ్యవధిలోనే జమ్ములోని సాంబా ప్రాంతంలో అనుమానాస్పద డ్రోన్లు కదలాడాయి. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు మన క్షిపణి రక్షణ వ్యవస్థ ద్వారా ఆ డ్రోన్‌లను కూల్చివేశాయి. ప్రస్తుతం సాంబా సెక్టారులో బ్లాకౌట్ అమలవుతోంది. సోమవారం రాత్రి ప్రధాని మోదీ దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడిన కొద్దిసేపటికే సాంబా సెక్టార్‌లోని సరిహద్దు ప్రాంతంలో ఒకటి కంటే ఎక్కువ డ్రోన్లు కనిపించినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. సరిహద్దు భద్రతా దళాలు ఈ డ్రోన్ల కదలికలను గుర్తించాయి. ఈ డ్రోన్ల చొరబాటును ధృవీకరించే వీడియో ఫుటేజ్ కూడా లభ్యమైంది. ఈ ఘటనతో సరిహద్దు వెంబడి నిఘాను మరింత కట్టుదిట్టం చేశారు. గత కొన్నిరోజులుగా పలుమార్లు ఈ ప్రాంతంలో పాకిస్థాన్ వైపు నుంచి డ్రోన్లు ప్రవేశించిన ఘటనలు నమోదయ్యాయి. ఆయుధాలు, మాదకద్రవ్యాలను జారవిడిచేందుకు, భారత సైనిక స్థావరాలపై నిఘా పెట్టేందుకు పాకిస్థాన్ డ్రోన్లను ఉపయోగిస్తోందని భద్రతా వర్గాలు అనుమానిస్తున్నాయి. సాంబా సెక్టార్‌లో డ్రోన్లను గుర్తించిన వెంటనే భద్రతా బలగాలు అప్రమత్తమై ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టాయి.

 

ఇది కూడా చదవండి: 22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

చిన్న సేవింగ్ పెద్ద లాభం! రోజుకు రూ.166 కడితే చాలు రూ.8 లక్షలు మీ ఖాతాలోకి.. స్కీమ్‌ గురించి మీకు తెలుసా?

 

విడదల రజిని ఓవరాక్షన్.. ఎట్టకేలకు అరెస్టు! మాజీ మంత్రితోపాటు కారులో..

 

ప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్టు.. స్పిల్‌ వే వద్ద భారీ గొయ్యి - జారిపోతున్న కొండ గట్లు!

 

వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలకు ఏపీ మంత్రులు! మార్గమంతా ప్రజలు పెద్ద సంఖ్యలో..

 

చంద్రబాబు శుభవార్త.. రైతుల అకౌంట్‌లలో డబ్బులు జమ! ఆ పథకం వారందరికి అసలు వర్తించదు..

 

ఏపీకి మరో కొత్త రైల్వే లైను! ఆ రోట్లోనే.. ! వారికి పండగే పండగ!

 

విద్యార్ధుల కోసం మరో పథకం తెస్తున్న కూటమి ప్రభుత్వం..! అప్పటి నుంచే అమల్లోకి!

 

బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!

 

పొరపాటున వేరే రైలెక్కిన మహిళ..! ఇంతలోనే ఎంత ఘోరం..!

 

హైదరాబాద్‌ విమానాశ్రయంలో హై అలెర్ట్! డ్రోన్లకు నో పర్మిషన్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Modi #Meeting #TamilNadu